puppydog-accidentally-shots-woman-in-chest

రైలు కూత విని దడుసుకున్న కుక్కపిల్ల.. యువతి గుండెల్లో దిగిన మూడు తూటాలు..

వాషింగ్టన్: అమెరికాలో ఓ యువతిని కుక్కపిల్ల తుపాకీతో కాల్చింది. ఈ ఘటన ఓక్లహామాలో గురువారం జరిగింది. నమ్మబుద్ధి కావడంలేదా? అయితే పూర్తిగా చదవండి. బ్రెంట్ స్పార్క్స్(72)ను, అతని కుక్కపిల్లను కారులో ఎక్కించుకున్న టీనా స్ప్రింగర్ డ్రైవింగ్ చేస్తోంది. ఆ సమయంలో ఆమె వద్ద ఓ తుపాకీ ఉంది. దారిలో ఓ రైల్వేక్రాసింగ్ దగ్గర కారును ఆపిన ఆమె.. తుపాకీ తీసి కారు డ్యాష్‌బోర్డుపై పెట్టింది. ఈలోపు పెద్దగా కూతపెడుతూ రైలు వచ్చింది. ఆ శబ్దం విన్న వెనకసీట్లోని కుక్కపిల్ల దడుసుకుంది. అంతే పెద్దగా అరుస్తూ ముందుకుదూకింది. ఆ సమయంలో డ్యాష్‌బోర్డుపై ఉన్న తుపాకీపై దాన్ని కాళ్లుపడ్డాయి. దురదృష్టవశాత్తూ ఆ తుపాకీ పేలింది.

దీంతో డ్రైవర్ సీట్లో ఉన్న టీనా ఛాతీలో మూడు తూటాలు దిగబడ్డాయి. ఈ ఘోరాన్ని చూసిన వెనుకసీట్లోని బ్రెంట్ వెంటనే అత్యవసరసేవల సిబ్బందికి సమాచారమిచ్చాడు. వారు అక్కడకొచ్చి టీనాను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు టీనా ప్రాణాలకు ఎటువంటి ప్రమాదమూ లేదన్నారు. ఆయుధాలతో ప్రయాణం చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని పోలీసులు హెచ్చరించారు.