Protesters-drag-mayor-out-of-her-office-and-did-this-to-her

మేయర్ అని కూడా లేకుండా.. ఆఫీసులోంచి జుట్టుపట్టుకొని లాక్కొచ్చి..

వింటో: బొలీవియాలో నిరసనకారులు రెచ్చిపోయారు. స్థానిక నాయకురాలి జుట్టును నడిరోడ్డుపై కత్తిరించి ఘోరంగా అవమానించారు. వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 20న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేశారు. ఈ ఆందోళనల్లో ఇద్దరు నిరసనకారులు మృతి చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దీనికి ఆ ప్రాంత మేయర్ పేర్షియా ఆర్స్ కారణమంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆమే హంతకురాలు అంటూ నినాదాలతో హెరెత్తించారు.

 
ఈ నేపథ్యంలో గురువారం కొంతమంది ముసుగు ధరించిన వ్యక్తులు మేయర్ కార్యాలయంలోకి ప్రవేశించి ఆమెను బయటకు లాక్కొచ్చారు. ఆమెపై ఎర్ర రంగు ఒలకబోశారు. అక్కడితో ఆగకుండా ఆమె జుట్టు కత్తిరించి.. బలవంతంగా రాజీనామా పత్రంపై ఆమెతో సంతకం చేయించారు. జరుగుతున్న ఘటనలతో తీవ్రంగా బెంబేలెత్తిపోయిన పేర్షియాను చివరకు పోలీసులు రక్షించారు. ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.