Protest-in-front-of-Gulf-Agent

గల్ఫ్‌ ఏజెంట్‌ ఇంటి ఎదుట బాధితుల ఆందోళన

రాయికల్‌, ఫిబ్రవరి 19: ఇరాక్‌కు పంపిస్తానని డబ్బులు తీసుకుని నకిలీ వీసాలతో మోసం చేసిన ఏజెంట్‌ ఇంటి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కిష్టంపేటలో మంగళవారం జరిగింది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం బావాపూర్‌కు చెందిన నవీన్‌, రాజశేఖర్‌, జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన చిన్న గంగారాంలతో పాటు కిష్టంపేటకు చెందిన శేఖర్‌, శివకుమార్‌, రమేష్‌, సత్యనారాయణల వద్ద నుంచి నందుకుమార్‌ 2017లో రూ.12 లక్షల వరకు ఇరాక్‌ పంపుతానని వసూలు చేశాడు. ఆ తరువాత రెండు నెలలకు నకిలీ వీసాలతో వారిని ఇరాక్‌ పంపించాడు. అక్కడికి వెళ్లిన తరువాత అవి నకిలీ వీసాలు అని తేలడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఇక్కడి నుంచి రూ.40 వేలతో టిక్కెట్లు తెప్పించుకునిస్వగ్రామానికి తిరిగివచ్చారు. ఏజెంట్‌ను నిలదీయగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు.