prime-minister-knows-about-9-minutes-before

న్యూజిలాండ్‌ ప్రధానికి 9 నిమిషాల ముందు మేనిఫెస్టో

క్రైస్ట్‌చర్చ్‌: క్రైస్ట్‌చర్చ్‌లో మారణకాండకు తొమ్మిది నిమిషాల ముందు దుండగులు శ్వేతజాతి అహంకారపూరితంగా ఉన్న తమ మేనిఫెస్టోను 30 మందికి పంపారు.వారిలో న్యూజలాండ్‌ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ కూడా ఉన్నారు. ‘‘అవును.. నా కార్యాలయానికి కూడా దుండగుల మేనిఫెస్టో వచ్చింది. వచ్చిన రెండు నిమిషాల్లో భద్రతాబలగాలను అప్రమత్తం చేశాం. అయితే.. దుండగులు ఎక్కడ? ఎలా? మారణకాండకు పాల్పడతారనే విషయాన్ని చెప్పలేదు’’ అని ఆమె వివరించారు. కాగా.. ఓ అనుమానాస్పద పార్సిల్‌ ఉందనే సమాచారంతో న్యూజిలాండ్‌లోని డనీడిన్‌ విమానాశ్రయాన్ని మూసివేశారు.

పాకిస్థానీకి జాతీయ అవార్డు: మసీదులో బ్రెంటన్‌ కాల్పులు జరుపుతుండగా.. పాకిస్థాన్‌లోని జిన్నాబాద్‌కు చెందిన నయీం రషీద్‌ మారణహోమాన్ని అడ్డుకునే యత్నం చేయగా బ్రెంటన్‌ అతడిని కాల్చి చంపేశాడు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అతడికి జాతీయ అవార్డు ప్రకటించారు.