President-Donald-Trump-Sensational-Comments-

ట్రంప్ చమత్కారానికి డాక్టర్లు తలల పట్టుకుంటుంటే.. నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు

వాషింగ్టన్: ఎవరెన్నైనా చెప్పనీయండి...ట్రంప్ చమత్కారమే వేరు. అస్సలు అర్థం కాదు. గతంలో అనేక సార్లు తన విచిత్ర వాక్యా ప్రయోగాల ద్వారా ట్విట్టర్‌లో కితకితలు పెట్టిన ట్రంప్ తాజాగా మరోసారి జూలు విదిల్చారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో కిడ్ని వ్యాధి చికిత్సకు సంబంధించి.. అధ్యక్షుడు ట్రంప్ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ...కిడ్నీకి హృదయంలో ప్రత్యేక స్థానం ఉందంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది...ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ట్రంప్ వ్యాఖ్యలకు డాక్టర్లు తలల పట్టుకుంటుంటే..నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు.