practical-joke-leaves-colleague-scalded-and-hospitalised

వెన్న వేడి చేసి ప్యాంటులో వేసిన చెఫ్.. లోపల కాలిపోవడంతో..

లండన్: ప్రాంక్ చేద్దామనుకున్న ఓ చెఫ్.. హద్దుమీరడంతో అతన్ని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్లు ఇంగ్లండ్‌లోని కాల్కట్ అండ్ స్పా హోటల్ యాజమాన్యం ప్రకటించింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఓ సీనియర్ చెఫ్ తన జూనియర్‌ను ఏడిపించాలనుకున్నాడు. దానికోసం వెన్నను బాగా వేడి చేసి.. నాథన్ డేవిస్ అనే కొత్త చెఫ్ ప్యాంటులో పోశాడు. దీంతో డేవిస్‌కు పిరుదులు, వెనుక భాగం కాలిపోయింది. విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినప్పటికీ, ఆర్థిక కారణాల వల్ల కొద్దిగా గాయాలు మానగానే డేవిస్ ఉద్యోగంలో చేరిపోయాడు. దాంతో ఆ గాయలు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాయి. ఈ విషయం గురించి చెప్పిన డేవిస్.. చెఫ్‌లు ఇలానే ర్యాగింగ్ చేస్తారని, కొత్తగా వంటగదిలో అడుగుపెట్టే వాళ్లు ఈ విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించాడు. ఈ విషయం హోటల్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వెంటనే ఈ చర్యకు పాల్పడిన సీనియర్ చెఫ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.