Plane-skids-on-runway-injuring-two

రన్‌వేపై జారిన విమానం.. నానా కష్టాలు పడ్డ సిబ్బంది..

కాఠ్మండు: ఆ విమానాశ్రయంలో రన్‌వేకు ఇటీవలే మరమ్మతులు చేశారు. అంతా సవ్యంగానే ఉందని అధికారులు భావించారు. విమానాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అదే వారు చేసిన పొరబాటు. ఎందుకంటే వారి అంచనాలు తారుమారయ్యాయి. వారు మరమ్మతులు చేసిన రన్‌వేపై ఓ విమానం నిలవలేక జారిపోయింది. శుక్రవారం నేపాల్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. రన్‌‌వే పక్కనే ఉన్న పచ్చగడ్డిలో దాదాపు 15 మీటర్ల దూరం విమానం జారిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల విమానం టైర్లు పట్టుతప్పాయని, విమానాన్ని అక్కడి నుంచి తొలగించేవరకు ఎయిర్‌పోర్టు సేవలను నిలిపివేస్తున్నామని విమానాశ్రయం జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ ఛెత్రి చెప్పారు. ఇలా జరగడం ఇక్కడ తొలిసారి కాదు. నేపాల్‌లో ఉన్న ఈ ఏకైక విమానాశ్రయంలో గత సెప్టెంబరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 139 మంది ప్రయాణికులతో ఉన్న విమానం రన్‌వేపై నుంచి జారిపోయింది. దీంతో ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు.