Plane-Left-Dangling-From-Ski-Lift

రోప్‌వేలో ఇరుక్కున్న విమానం.. గంటన్నర పాటు అలానే..

రోమ్: గాల్లో ఎగురుతున్న విమానం ప్రమాదవశాత్తూ రోప్‌వేలో ఇరుక్కుపోయింది. ఇటలీలోని ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. రోప్‌వేలో చిక్కుకున్న వెంటనే విమానం కుదుపుకు లోనవడంతో.. పైలట్ ఒక్కసారిగా బయట విమాన రెక్కపై పడ్డాడు. ఆ సమయంలో రోప్‌వేపై వెళ్తున్న ఓ వ్యక్తి.. ఫోన్ ద్వారా అత్యవసర సర్వీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది.. బాధితులను రక్షించారు. కాగా, ఈ ఘటనలో పైలట్‌, మరో ఇద్దరు వ్యక్తులకు చిన్నపాటి గాయాలయ్యాయి.  దాదాపు 20 మంది సిబ్బంది గంటన్నర పాటు శ్రమించి వీరిని రక్షించారు. "వారంతా అదృష్టవంతులు. పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. విమానం నేల మీద కూలిపోయి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది" అని అత్యవసర సిబ్బంది ఒకరు వ్యాఖ్యానించారు.

వీడియో కోసం క్లిక్ చేయండి