People-Crawling-Out-Of-Manhole-In-US-Border-Town

వీడియో: వలసదారులు అమెరికాలోకి ఎలా ప్రవేశిస్తున్నారో చూశారా?

టెక్సాస్: ‘మెక్సికన్లు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించకుండా బోర్డర్ నిర్మిస్తా’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి నిత్యం చెప్పే మాట ఇది. బోర్డర్ నిర్మాణ ఖర్చుకు డెమొక్రాట్లు ఆమోదం తెలుపనందుకు ట్రంప్ అమెరికా షట్‌డౌన్‌కు పాల్పడటం కూడా చూశాం. అయితే వలసదారులు అక్రమంగా అమెరికాలోకి రాకుండా అధికారులు ఎన్ని రకాలుగా నియంత్రిస్తున్నప్పటికీ.. బోర్డర్ నుంచి వివిధ రకాలుగా వారు అమెరికాలోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. టెక్సాస్‌లోని ఎల్ పరో నగరం అమెరికా, మెక్సికోకు బోర్డర్ ప్రాంతం. తాజాగా ఓ అమెరికన్ పోస్ట్ చేసిన వీడియో ద్వారా వలసదారులు అమెరికాలోకి ఎలా ప్రవేశిస్తున్నారో చూడచ్చు. రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్ నుంచి ఒకరి తరువాత ఒకరు.. ముగ్గురు వ్యక్తులు బయటకు రావడాన్ని వీడియోను గమనించవచ్చు. ఈ వీడియోను తీసిన అమెరికన్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే వారు వలసదారులే అని ఇప్పటివరకు ఎవరూ నిర్దారించలేదు. బోర్డర్ ప్రాంతం కావడంతో వారు తప్పకుండా వలసదారులే అయ్యుంటారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Video Source: NYOOOZ TV

 

Related Articles