passport-services-in-post-office

పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్‌ సేవలు

విజయవాడ సిటీ, డిసెంబరు 6: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాధాన తపాలా కార్యాలయాల్లో ఆధార్‌, పాస్‌పోర్ట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర ప్రధాన పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ బాలసుబ్రమణియన్‌ గురువారం తెలిపారు. ప్రధాన పోస్టాఫీసులు, 519 సబ్‌ పోస్టాఫీసుల్లో ఆధార్‌ నమోదు, సవరణ సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. వీటితోపాటు పాస్‌పోర్టు సేవలను 12 ప్రధాన పోస్టాఫీసు (కర్నూల్‌, కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, గుడివాడ, గుంటూరు, ఒంగోలు, అమలాపురం)ల్లో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.