Passengers-shocked-as-men-fight-on-Ryanair-plane-over-woman-not-wearing-shoes

అమ్మాయి గురించి విమానంలో కొట్టుకున్నఇద్దరు యువకులు

టెనెరిఫ్: గ్లాస్గో ప్రీస్ట్‌విక్ నుంచి టెనెరిఫ్ సౌత్ వెళ్తున్న ర్యాన్‌ఎయిర్ విమానంలో శనివారం పెద్ద గొడవ జరిగింది. ఒక అమ్మాయి గురించి ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నారు. దీంతో విమాన యాజమాన్యం వారిద్దరినీ పోలీసులకు అప్పగించింది. ఇంతకీ విమానంలో జరిగిన గొడవ ఏంటంటే.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువతి చెప్పులు లేకుండా టాయిలెట్‌కు వెళ్లింది. ఇది నచ్చని ఓ వ్యక్తి యువతిని తిట్టాడు. మందు తాగి ఉండటంతో ఆ వ్యక్తి యువతితో గొడవ పెట్టుకున్నాడు. ఇంతలో అక్కడకు వచ్చిన యువతి బాయ్‌ఫ్రెండ్ అవతలి వ్యక్తితో గొడవకు దిగాడు. ఇక్కడ విశేషమేంటంటే.. ఇద్దరు వ్యక్తులూ మందు తాగే ఉన్నారు. దీంతో వారిద్దరినీ కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు. ఆపడానికి వెళ్లిన ఓ వ్యక్తి ముక్కుకు గాయం కూడా అయి రక్తం కారింది. ఒక ఎయిర్‌హోస్టస్ చాకచక్యంగా పరిస్థితిని మాములు స్థితికి తీసుకొచ్చింది. అనంతరం విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరినీ ఎయిర్‌పోర్టు అధికారులకు అప్పగించారు. జరిగిందంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వార్త వైరల్ అయ్యింది. మై న్యూస్ టీవీ సౌజన్యంతో.. వీడియో కోసం క్లిక్ చేయండి