Passengers-frightened-with-low-oxygen-in-flight

విమానంలో ఆక్సిజన్ అందక.. భయంతో వణికిపోయిన ప్యాసింజర్స్..

చెన్నై, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుచ్చి విమానాశ్రయం నుంచి మరికొద్ది సేపట్లో మలేషియాకు బయల్దేరాల్సిన విమానంలో ఆక్సిజన్‌ సరిగా అందకపోవడంతో చివరి క్షణంలో ఆ సర్వీసును రద్దు చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మలేషియాకు వెళ్లాల్సిన విమానం ఎక్కిన 120 మంది ప్రయాణికులు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సిబ్బంది తనిఖీ చేయగా.. ఆక్సిజన్‌ను నియంత్రించే పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదని గుర్తించారు. దీంతో వెంటనే ఆ విమాన సర్వీసును రద్దు చేశారు.