Over-2000-Fetal-Remains-Found-On-US-Doctor-Property

చనిపోయిన డాక్టర్ ఇంట్లో దొరికిన 2200 పిండాలు

ఇల్లినోయిస్: అమెరికాలో ఓ డాక్టర్ ఇంట్లో 2200 మంది శిశువు పిండాలను ఇండియానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్‌రిచ్ క్లాఫర్ అనే డాక్టర్ ఈ నెల మూడో తేదీన మరణించాడు. ఆయన మరణించిన తరువాత ఆయన పర్సనల్ ప్రాపర్టీలను తనిఖీ చేయగా.. 2246 పిండాలు లభ్యమయ్యాయి. వాటన్నిటిని సురక్షితంగా ఆయన ప్రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. అల్‌రిచ్ మూడు దశాబ్దాల నుంచి ఇండియానాలో ఎంతో మంది మహిళలకు అబార్షన్‌లు చేస్తూ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. డాక్యుమెంటేషన్, తదితర విషయాలలో ఆయన ఉల్లంఘనలకు పాల్పడటంతో 2016లో ఆయన మెడికల్ లైసెన్స్‌ను స్టేట్ మెడికల్ బోర్డు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇన్‌వెస్టిగేషన్‌కు సంబంధించి అల్‌రిచ్ కుటుంబం తమతో అన్ని విషయాలను వెల్లడిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.