Oklahoma-Airman-helps-Elderly-Woman-Video-goes-Viral

అమెరికాలో కారులో వెళ్తుండగా నడిరోడ్డుపై కనిపించిందో సీన్.. వీడియో వైరల్

ఓక్లహోమా: ఇతరులకు సాయం చేసే మాట అటుంచితే.. సొంతవారినే పట్టించుకోని ఘటనలు కోకొల్లలు. అలాంటిది ఎవరో పరిచయంలేని ఓ ముసలావిడా మండుటెండలో నడిరోడ్డుపై భుజాలకు బరువైన సామాన్లు తగిలించుకొని వెళ్లడం చూసిన ఓ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి వెంటనే తన వాహనాన్ని ఆపి ఆమెకు సహయం చేశాడు. మానవత్వం మచ్చుకకు కూడా కనిపించని ఈ రోజుల్లో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఎక్కడో మూలాన కొందరిలో ఇంక మానవత్వం బతికే ఉందనిపిస్తోంది. ఓక్లహోమా సీటీలో ఎయిర్మన్ జిబ్రిల్ జెన్నింగ్స్ ఓ పెద్దవిడాకు చేసిన సాయానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. జానిస్ హాల్ అనే వృద్ధురాలు స్థానికంగా ఉండే వాల్‌మార్ట్ స్టోర్‌కు వెళ్లి తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఇల్లు పక్కనే(రెండు మైళ్లు) ఉండడంతో క్యారీ బ్యాగులు భుజాలకు వేసుకొని రోడ్డుపైకి వచ్చింది. అప్పటికే కొంతదూరం నడిచింది జానిస్‌.

అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న జెన్నింగ్స్ ఆమెను చూశాడు. వెంటనే తన వాహనాన్ని జానిస్ ముందు ఆపాడు. ఆమె చేతిలో ఉన్న కవర్లను తన కారు డిక్కిలో వేసుకున్నాడు. ఆ తరువాత  ఆమెను కారులో కూర్చొబెట్టుకొని ఎక్కడికి వెళ్లాలో చెప్పమని అడిగాడు. దాంతో జానిస్ నా ఇల్లు పక్కనే అని చెప్పింది. దాంతో ఆమెను ఇంటి వద్ద దిగబెట్టాడు జెన్నింగ్స్. ఆ సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తమ మొబైల్ వీడియో తీసి అంతర్జాలంలో పెట్టారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఈ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. తాను వృద్ధురాలికి సాయం చేస్తున్నప్పుడు వీడియో తీసిన విషయం అసలు తనకు తెలియదని.. నెట్టింట తన వీడియో వైరల్ అవుతుందని స్నేహితులు చెప్పడంతో తాను జెన్నింగ్స్ ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు జెన్నింగ్స్‌ను ప్రశంసిస్తున్నారు.         

Video Source: Zackattack