NRIs-Participates-in-green-challenge-in-Sydney

సిడ్నీలో గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఎన్నారైలు

సిడ్నీ: ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు రాష్ట్రం, దేశం ధాటి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరింది. తెలంగాణలోని ప్రజలకు దీని ఆవశ్యకతను తెలియజేయడానికి గురువారం సిడ్నీలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మొక్కలు నాటారు. సంతోష్ గారి ఛాలెంజ్ స్వీకరించిన మహేష్ బిగల ద్వారా తాను స్వీకరించి సిడ్నీలో రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఒక ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగుతూ తెలంగాణ పచ్చదనం, కాలుష్యం లేకుండా ఆరోగ్య ఆకు పచ్చ తెలంగాణ కావాలని కోరుకుంటున్నాని నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఏస్‌డబ్ల్యూ ఇంఛార్జి ప్రవీణ్ పిన్నమ, సరళ  కుమారి, జ్యోతి వడ్రేవు, స్వాతి నల్లాన్, రవి దూపాటి, లక్ష్మణ చార్యులు నల్లాన్, పరశురామ్ మొతుకుల, జస్వంత్  కొడరపు, సాంబ శివ రెడ్డి పాల్గొన్నారు.