NRI-woman-gets-UAEs-gold-card-

ఈ బామ్మ.. యూఏఈలో గోల్డ్ కార్డ్ పొందిన తొలి ఎన్నారై మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?

దుబాయి: యూఏఈ తదితర దేశాల్లో శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు ఇచ్చే గోల్డ్‌కార్డును తొలిసారిగా ఓ భారతీయ మహిళ పొందారు. ఈ గోల్డ్‌కార్డుల విధానాన్ని అమలు చేయడం మొదలెట్టగానే.. తొలి గోల్డ్‌కార్డును దుబాయిలో వ్యాపారం చేస్తున్న భారత వ్యాపారవేత్తకే ఇచ్చారు. ఇప్పడు కూడా జులేఖా దావూద్(81) అనే ఓ డాక్టరుకు ఈ కార్డు అందజేశారు. వైద్యరంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అధికారులు తెలిపారు.

మొన్నామధ్య వరకు ఈ దేశాల్లో ఈ సదుపాయం లేదు. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గోల్డ్‌కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు అమెరికా గ్రీన్‌కార్డులు ఇస్తుందని తెలిసిందే. ఈ తరహాలోనే తమ దేశంలోని వలసదారులకు కూడా ఇక్కడ శాశ్వత పౌరసత్వం పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని రూపొందించింది.