NRI-Who-Wanted-to-Vote-Posted-Ticket-to-India-Online,-Pranksters-Cancelled-it

ఓటు వెయ్యాలని విమానం టికెట్ బుక్ చేసిన ఎన్నారై.. తనకే తెలీకుండా..

మస్కట్: భారతదేశంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయ వేడి తగ్గినప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో ఇంకా రాజకీయాలు రసవత్తరంగానే సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోడానికి ప్రవాసీయులు సైతం తరలి వస్తున్నారు. కర్ణాటకలోని పుత్తూరుకు చెందిన జాయ్‌స్టన్ లోబో అనే ఎన్నారై మస్కట్‌లో నివాసముంటున్నాడు. తన స్వగ్రామంలో ఓటు వేయాలని చెప్పి.. లోబో మార్చిలోనే విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే ఆ టికెట్ తనకు తెలీకుండానే క్యాన్సిల్ అయిపోయింది. ఏప్రిల్ 1న జరిగిన విషయం తెలుసుకున్న లోబో ఎక్కువ రేటుకు మళ్లీ టికెట్ బుక్ చేసుకుని స్వదేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. లోబో తన విమాన టికెట్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం కారణాంగానే ఎవరో తెలియని వ్యక్తులు తనకు తెలియకుండా విమాన టికెట్‌ను రద్దు చేసినట్టు లోబో తెలుసుకుని షాక్ అయ్యాడు. సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌ల పట్ట జాగ్రత్త వహించాలని లోబో చెబుతున్నాడు. రద్దు అయిన టికెట్ కారణంగా తనకు రూ.9 వేలు నష్టం జరిగిందని.. అయినప్పటికీ ఓటు వేయడం మాత్రం మరవనని లోబో గర్వంగా చెప్పాడు.