NRI-to-compete-in-Texas-elections

టెక్సాస్‌ ఎన్నికల బరిలో భారతీయుడు..

టెక్సాస్: అమెరికా రాజకీయాల్లో భారతీయుల పాత్రను మెరుగుపరిచేందుకు ఎంతోమంది భారతీయ-అమెరికన్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2020లో జరిగే అమెరికా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో టెక్సాస్‌కు చెందిన ఓ భారతీయ డాక్టర్ కూడా చేరాడు.  ప్రీతేశ్ గాంధీ అనే ఆయన టెక్సాస్‌లోని డెల్ మెడికల్ స్కూల్లో క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. తాను డిస్ట్రిక్ట్ 10 నుంచి డెమోక్రాట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఇక్కడ గెలిచిన రిపబ్లికన్ అభ్యర్థి మైఖేల్ మెక్‌కాల్‌ను ఓడించడమే గాంధీ లక్ష్యం. అయితే అతనికి ఎదురయ్యే మరో పెద్ద సమస్య డెమోక్రాట్ల నుంచే. ఇక్కడ గతంలో డెమోక్రాట్ అభ్యర్థిగా ఉన్న మైక్ సీగెల్ చాలా బలమైన అభ్యర్థి. దాంతో అతని స్థానంలో గాంధీ అభ్యర్థిత్వానికి ఆ డెమోక్రాట్లు ఎంతవరకు ఆమోదం తెలుపుతారో వేచి చూడాల్సిందే. ‘ప్రతి ఒక్కరితో మాట్లాడి, వారి సమ్యలు తెలుసుకోవడమే మా వ్యూహం. గెలవడానికి అంతకన్నా చేసేదేముంది. ఇది కచ్చితంగా గెలుపు వ్యూహమే’ అని గాంధీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.