NRI-sentenced-to-20yr-prison-in-USA

అమెరికాలో ఎన్నారైకి 20ఏళ్ల జైలు.. 7కోట్ల జరిమానా.. ఇంతకీ ఏం చేశాడంటే..

న్యూయార్క్: ఉద్యోగం కోసం అమెరికాలో అడుగుపెట్టిన రాకేష్ కౌశల్ అనే ప్రవాసీ అడ్డదారులు తొక్కాడు. తనకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీలోని ఓ ఉన్నతాధికారితో కలిసి రూ.12కోట్లపైగా కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన ఇవాన్ విక్టర్ థ్రేన్ అనే వ్యక్తి మూడు కంపెనీల బోర్డుల్లో ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఈ కంపెనీలు ముఖ్యంగా ప్రభుత్వరంగ నిర్మాణాలు చేపడతాయి.

వీటిలో ఒకదానిలో ఉద్యోగంలో చేరిన రాకేష్, ఇవాన్‌తో కలిసి మూడు కంపెనీలు చేసిన పనులన్నింటినీ తాను పనిచేస్తున్న కంపెనీనే పూర్తి చేసినట్లు పత్రాలు సృష్టించాడు. వీటిపై ఆమోదముద్ర వేసిన ఇవాన్‌.. మిగతా కంపెనీలకు అందాల్సిన సొమ్మును పక్కదారి పట్టించాడు. ఇలా వీరిద్దరూ కలిసి రూ.12కోట్లపైగా కాజేశారు. విషయం తెలుసుకున్న మిగతా కంపెనీల యాజమాన్యాలు రాకేష్, ఇవాన్‌పై కోర్టుకెక్కాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు వీరిద్దరినీ నిందితులుగా గుర్తించింది. ఈ కేసులో రాకేష్‌ 20ఏళ్లపైగా జైలుశిక్ష అనుభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీరిద్దరూ కలిసి నష్టపోయిన కంపెనీకి రూ.7కోట్లు తిరిగిచెల్లించాలని కోర్టు ఆదేశించింది.