NRI-resigned-to-his-job-for-Narendra-Modi

సెలవివ్వనన్న అధికారులు, మోదీ కోసం ఉద్యోగానికి రాజీనామా

కర్ణాటక: మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని కర్ణాటకకు చెందిన ఓ ఎన్నారై ఉద్యోగానికే రాజీనామా చేశాడు. కర్ణాటకలో ఈ నెల 18న ఎన్నికలు జరుగుతుండటంతో.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానశ్రయంలో స్క్రీనింగ్ అధికారిగా పనిచేస్తున్న సుధీంద్ర అనే ఎన్నారై ఏప్రిల్ 5 నుంచి 12 వరకు ఉద్యగానికి సెలవు పెట్టి తన స్వగ్రామమైన కర్ణాటకలోని మంగళూరుకు చేరుకుని బీజీపీ తరపున ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఎన్నికలు 18న కావడంతో మరో ఐదు రోజులు సెలపు పెంచాల్సిందిగా తన యాజమాన్యాన్ని కోరగా.. వారు ససేమిరా అన్నారు. దీనికి ఆగ్రహించిన సుధీంద్ర బీజేపీ కోసం, మోదీని మరోసారి ప్రధానిని చేయడం కోసం తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసేశాడు. తన కుటుంబసభ్యులు ఆస్ట్రేలియాలోనే ఉన్నారని.. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆస్ట్రేలియా వెళ్లి మరో ఉద్యోగం చూసుకుంటానని సుధీంద్ర తెలిపాడు.