NRI-man-gets-life-term-for-sexual-abuse-of-girl-in-US

అమెరికా యువతిని లైంగికంగా వేధించిన ఎన్నారై.. 30 ఏళ్ల జైలు శిక్ష

న్యూయార్క్: మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఎన్నారైకు అమెరికా కోర్టు జీవితఖైదు విధించింది. దీపక్ పాండే అనే ఎన్నారై చాటింగ్ ద్వారా 2017 జులైలో ఆర్లాండోకు చెందిన అమెరికన్ యువతితో మోడలింగ్ ఏజెంట్ అంటూ పరిచయం చేసుకున్నాడు. పరిచయం బాగా పెరగడంతో.. మైనర్ బాలికను నగ్న ఫొటోలను పంపాలని కోరేవాడు. బాలిక కూడా దీపక్ మాటలను నమ్మి ఫొటోలను పంపిస్తూ వచ్చింది. అలా కొంతకాలం తరువాత యువతి ఫొటోలు పంపనని చెప్పడంతో.. ఆమె ఫొటోలను అందరికి పంపిస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. 2017 సెప్టెంబరులో మొదటిసారిగా యువతిని కలవడానికి క్యాలిఫోర్నియా నుంచి ఆర్లాండో వెళ్లాడు. అనంతరం యువతి పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా దీపక్‌ను అరెస్ట్ చేసినట్టు సమాచారం. గతేడాది అక్టోబర్‌లో తాను చేసిన నేరాన్ని దీపక్ అంగీకరించగా.. గురువారం కోర్టు తీర్పునిచ్చింది. లైంగికంగా వేధించినందుకు  జీవితఖైదు విధించగా.. మైనర్ పోర్నోగ్రఫీకి పాల్పడినందుకు అదనంగా 30 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.