NRI-industrialist-named-for-Britains-House-of-Lords

రూ.170తో వ్యాపారం మొదలెట్టి.. పార్లమెంటు ఎగువ సభకు.. ఓ భారతీయుడి ప్రస్థానం..

లండన్: ఇంగ్లండ్‌లో నివాసముంటున్న ఎన్నారై బిజినెస్‌మాన్ రామి రేంజర్‌ పార్లమెంటు ఎగువసభకు వెళ్లనున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వం మంగళవారం ఓ ప్రతిపాదన చేసింది. కన్సర్వేషన్ పార్టీకి చెందిన ఆయన బ్రిటన్ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తాను భారత్, బ్రిటన్, పాకిస్తాన్ తదితర దేశాల మధ్య స్నేహపూర్వక బంధాలు ఏర్పాటు చేయడానికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్‌లో నివశిస్తున్న రకరకాల వర్గాల ప్రజల మధ్య వారధిలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

1947లో గుజ్రన్‌వాలా(ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)లో పుట్టిన ఆయన.. దేశవిభజన సమయంలో పంజాబ్ వచ్చేశారు. ఆ సమయంలో జరిగిన దాడుల్లో రామి తండ్రి మరణించారు. రామికి ఏడుగురు సోదరులు, ఓ సోదరి ఉన్నారు. చండీగఢ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న రామి.. లండన్‌లో న్యాయవిద్యనభ్యసించారు. ఆ తర్వాత కేవలం రెండు పౌండ్లు(రూ.177) పెట్టి కార్గో షిప్పింగ్ వ్యాపారం మొదలెట్టారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి కోటీశ్వరుడిగా మారారు. సన్ మార్క్ లిమిటెడ్, సీ ఎయిర్ అండ్ ల్యాండ్ ఫోర్వార్డింగ్ లిమిటెడ్ కంపెనీలు స్థాపించారు. ప్రస్తుతం వాటికి ఆయనే చైర్మన్‌. అలాగే బ్రిటిష్ సిక్కు సంఘానికి అధ్యక్షత కూడా వహిస్తున్నారు. సన్ మార్క్ కంపెనీ ద్వారా తాను సభ్యుడిగా ఉన్న కన్సర్వేషన్ పార్టీకి రూ.8.8కోట్లపైగా విరాళాలిచ్చారు. బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే లీడర్‌షిప్ క్యాంపెయిన్ కోసం గతంలో రూ.22లక్షలపైగా నిధులు సమకూర్చారు.

Related Articles