Nine-friends-charged-in-Texas

టెక్సాస్‌లో తొమ్మిది మంది మిత్రుల ముఠా.. అడ్డంగా బుక్కయింది..

టెక్సాస్: తొమ్మిది మంది మిత్రులు ఓ ముఠాగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన టెక్సాస్ పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి చర్యలపై ఆరా తీయగా.. డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి పనులు చేస్తున్నట్లు వారి దృష్టికి వచ్చింది. వీరిలో ఎవరో ఒకరు డ్రగ్స్ సంపాదిస్తారని, మిగతావారంతా కలిసి ఆ మత్తుపదార్థాన్ని రవాణా చేస్తారని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత వచ్చిన డబ్బును చాలా బ్యాంకు ఖాతాలకు పంపిస్తారని, దాంతో వారిని పట్టుకోవడం కష్టమవుతుందని అన్నారు. వీరంతా కలిసి చాలా పకడ్బందీగా పథకం ప్రకారం ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తొమ్మిది మంది మిత్రులపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టు ముందు ఉంచనున్నట్లు తలిపారు. తమ అవసరాలకు డబ్బు చాలా అవసరమని, అందుకోసం అడ్డదారులు తొక్కక తప్పిందికాదని నిందితులు అంటున్నారు.