New-law-in-Kuwait

3 రోజులు.. 3 నెలలు.. కువైట్ సరికొత్త అస్త్రం

కువైట్: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు కువైట్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అధిక వేగం, రోడ్డు భద్రతా నిబంధనలను అతిక్రమించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న కారణంగా.. చట్టాలను మరింత కఠినం చేసింది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి విధించే శిక్షలను, జరిమానాలను అమాంతం పెంచేసింది. చట్టాలను ఉల్లంఘించిన డ్రైవర్లకు మూడు రోజుల పాటు జైలు శిక్షను విధించాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ప్రమాదాలకు గురయిన వాహనాలను మూడు నెలలపాటు రోడ్డుపైకి రానీయకుండా చేయాలని ఆదేశించారు. దీంతోపాటు 150 కువైటీ దీనార్లు (దాదాపు 33 వేల రూపాయలు) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా  సిగ్నల్స్ వద్ద రెడ్‌లైట్ క్రాస్ చేసినా.. ఇష్టం వచ్చిన చోట కార్లను పార్క్ చేసినా 100 కువైట్ దీనార్లు (22 వేల రూపాయలు) ఫైన్ విధిస్తారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన నియమనిబంధనలతో కూడిన ప్రతిపాదనలను ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రటరీ లెటినెంట్ మేజర్ సులేమాన్ అల్ ఫహ్ద్.. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ మహమ్మద్ అల్ ఖాలిద్‌కు పంపించారు. 

 

 

Related Articles