NATS-free-medical-camp-in-guntur-dist

గుంటూరు జిల్లాలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

గుంటూరు, ఏప్రిల్ 2: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో సేవా కార్యక్రమానికి నిర్వహించింది. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కోతివాని పాలెంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. దాదాపు 2000 మంది ఈ ఉచిత వైద్యశిబిరానికి విచ్చేసి డాక్టర్ల విలువైన సూచనలు, మందులను తీసుకున్నారు. నాట్స్ ప్రతినిధి శ్రీనివాస్ మంచికలపూడి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరానికి కామేపల్లి వెంకటేశ్వర్లు, బాలకృష్ణ మంచికలపూడి, సుధాకర్ గరికపాటి, తదితరులు హాజరయ్యారు. కోతివాని పాలెం గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి సహకరించారు. గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ జానీమూన్‌తో పాటు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కూడా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు తమవంతు సహాయ సహకారాలు అందించారు. గుంటూరు రమేష్ హాస్పిటల్స్, శంకర్ ఐ పౌండేషన్ వారి సహకారాలతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని  నిర్వహించారు. మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తితో, నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ ఆధ్వర్యంలో మరికొంత మంది నాట్స్ ప్రతినిధులతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు తెలిపారు.