Mums-horror-after-finding-creep-man-in-her-house

కూతురి గదిలో రహస్యంగా ఉంటున్న యువకుడు.. ఒకరోజు..

టెన్నెస్సి:తనకు తెలీకుండా తన ఇంట్లోనే ఓ యువకుడు ఎన్నో రోజుల నుంచి నివసిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమెరికాలోని టెన్నెస్సీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. తన 14 ఏళ్ల కూతురి గదిలో మ్యాథ్యూ కాస్టో(18) అనే యువకుడు రహస్యంగా ఉంటున్నాడని, ప్రతి రోజు రాత్రి సమయంలో అందరూ పడుకున్నాక వేరే ద్వారం ద్వారా తన కూతురి గదిలోకి ప్రవేశిస్తున్నాడని చెప్పింది. తాను ఒకరోజు బయటకు వెళ్లి ఇంటికొచ్చే సరికి గెడ్డంతో, జులపాలు జుట్టుతో యువకుడు ఇంట్లో కనిపించినట్టు పేర్కొంది. వెంటనే తనను చూసిన యువకుడు కూతురి గదిలోకి వెళ్లి గడి పెట్టుకున్నాడని, బయటకు వెళ్లమన్నా వెళ్లనన్నాడని తెలిపింది. అదే సమయంలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ నుంచి ఫోన్ రాగానే అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడిని బలవంతంగా బయటకు లాగి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా.. రెండు వేల డాలర్ల బాండ్‌తో విడుదల చేశారు. మరోసారి ఆ ఇంటికి వెళ్తే శిక్ష విధిస్తామని జడ్జి హెచ్చరించారు. కాగా, యువతికి, యువకుడికి మధ్య ఏం సంబంధం ఉంది, ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడనే విషయాలు తెలియాల్సి ఉంది.