Mum-filmed-torturing-her-three-young-kids

బాయ్‌ఫ్రెండ్ కోసం పిల్లల తల్లి.. ఏం చేసిందో తెలిస్తే..

బాయ్‌ఫ్రెండ్ కోసం కన్న పిల్లలకు నరకం చూపించిన ఓ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జెన్నిఫర్ మారిసల్(26) అనే యువతికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే యువతికి మరో బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధం ఉండగా.. అతని కోసం కన్న పిల్లలకు నరకం చూపిస్తుండేది. బాయ్‌ఫ్రెండ్‌పై తనకున్న ప్రేమను చాటిచెప్పడానికని జెన్నిఫర్ ఏడాది వయసున్న కూతురి కాలు గోరును పీకేసింది. ఈ ఘటనను వీడియో తీసి తన బాయ్‌ప్రెండ్‌కు పంపింది. ఇలా పసిపాపకు నరకం చూపిస్తూ రాక్షసానందం పొందుతూ వస్తోంది. జెన్నిఫర్ తీసిన వీడియో ఆమె భర్త కంటపడడంతో తన భార్యపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. వీడియోను చూసిన అధికారులు ఆమెను ప్రశ్నించగా తన బాయ్‌ఫ్రెండ్‌పై ప్రేమతోనే ఇలా చేసినట్టు తెలిపింది. కేవలం ఇదే కాకుండా తన పిల్లలను మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నట్టు తెలిసిందని బిడ్డల తండ్రి చెప్పుకొచ్చాడు.