MP-Subrahmnya-swamy-in-Texas

‘భారతదేశంలో ఉన్నవాళ్లందరూ హిందువులే’

టెక్సాస్: అమెరికా అంటేనే క్రైస్తవులు అని ఎలా భావిస్తారో.. ఇండియా అంటే హిందువులు అని గుర్తింపు మనకు ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. భారత్‌లోని క్రైస్తవులు, ముస్లింలు కూడా హిందువులేనని, హిందూ అంటే ఓ మతం కాదనీ భారతీయ గుర్తింపు అని ఆయన వ్యాఖ్యానించారు. ‘భారతీయ ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ’ అనే అంశంపై డల్లాస్‌లోని ప్లానోలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సభలో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడారు. సెప్టెంబర్ 13న జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 600మంది భారతీయులు పాల్గొన్నారు. భారత్‌లో ఎంతో కాలంగా వివాదాస్పద అంశంగానే మిగిలిపోయిన బాబ్రీ మసీదు గురించి ఆయన తన అభిప్రాయాన్ని ఈ సభలో వెలిబుచ్చారు. ఆలయాలు ప్రభుత్వాల నియంత్రణలోనుంచి వెళ్లిపోతే.. భవిష్యత్తులో హిందువులకు కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందన్నారు. వివిధ అంశాలపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన ప్రసంగానికి గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ వాలంటీర్ మహేష్ చోప్రా ధన్యవాదాలు తెలిపారు. ఆయా అంశాలపై ఉన్న పూర్తి అవగాహన, చేసిన పరిశోధనల వల్లే ఈ స్థాయిలో స్వామి మాట్లాడగలిగారని మరో వాలంటీర్ రాజహ్ వ్యాసరాజు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు అల్పేష్ పటేల్, ఆనంద్ చెల్లప్ప, అనిల్ ముతోజు, అను అప్పాజి, డాక్టర్ అరుణ్ చంద్రకాంతన్, దివ్యా శెల్వ, గగన్ శోరి, హరి రామసుబ్బు, ఐవీ రావు, కల్యాణి తడిమెటి, కామేశ్వరరావు నెమని, లక్ష్మి తుమ్మల, మధుమతి వ్యాసరాజు, మహేష్ చోప్రా, మంజరి గంగ్వార్, ప్రశాంత్ పటేల్, ఆర్కే పండిటి, రాజ్ కుమార్ దండు, రాజహ్ వ్యాసరాజు, వెంకట్ కొయింబతూర్, రామ్ మజ్జి, రావు కాల్వల, రవి పట్టిసం, సంజయ్ తివారి, సతీష్ కండీ, శ్రీ గౌర్, శివ అగ్నూర్, శ్రీకాంత్ కొండ, శ్రీనివాస్ గుల్డవల్లేటి, కన్నం శ్రీనివాసన్, శ్రీనివాస్ కొడవటిగంటి, శ్రీనివాస్ పమిడిముక్కల, శ్రీధర్ కోడెల, వెంకట్ కరుమూడి, విజయ్ తొడుపునూరి, విజయ్ భోగరాజు, విష్ణు చిమ్ములకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. 

సనాతన ధర్మ ఫౌండేషన్, కార్య సిద్ధి హనుమాన్ టెంపుల్, డీఎఫ్‌డబ్ల్యూ హిందూ టెంపుల్, ఎకల్ విధ్యాలయ, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ, హిందూ స్వయంసేవక్ సంఘ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రాధాకృష్ణ టెంపుల్, రామ్ మందిర్, ఇషా ఫౌండేషన్, దివాలి మేళా టీం, డీఏటీఏ, టీపీఏడీ, ఎంజీఎమ్‌ఎన్2టీ సంఘాలు ఈ కార్యక్రమ విజయవంతానికి తోడ్పడ్డాయి. 

 ఫోటోగ్యాలరీ కోసం క్లిక్ చేయండి...