Mother-threw-daughter-from-ninth-floor

మూడ్ బాలేదని రెండేళ్ల బిడ్డను తొమ్మిదో ఫ్లోర్ నుంచి విసిరేసిన తల్లి

రష్యా: మూడ్ బాలేదని రష్యాలో ఓ యువతి అమానుషంగా ప్రవర్తించింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డను ఆమె కోపానికి బలితీసుకోబోయింది. దక్షిణ రష్యాలోని యూఎఫ్‌ఏ ప్రాంతానికి చెందిన యువతి రెండు సంవత్సరాల బిడ్డను తొమ్మిదో ఫ్లోర్ నుంచి కిందకు పడేసింది. ఏమైందో తెలియదు కాని.. వెంటనే ఆమె కూడా దూకేసింది. ఇక్కడ విచిత్రమేంటంటే.. తల్లీ , బిడ్డ ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. అంత పైనుంచి పడి కూడా వాళ్లు ఎలా బతికారా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. రష్యాలో ప్రస్తుతం చలి పంజా విసురుతోంది. యువతి నివసిస్తున్న ప్రాంతంలోని రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో బిడ్డ పైనుంచి పడిన వెంటనే మంచులో కూరుకుపోయింది. వెంటనే తల్లి కూడా బిడ్డ పక్కనే పడింది. స్థానికులు వెంటనే వారిని గమనించి ఆసుపత్రికి తరలించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరోపక్క యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కావాలనే బిడ్డను పడేసినట్టు  నేరాన్ని అంగీకరిస్తే కోర్టులో ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.