Mother-Shocks-after-She-Finds-Stranger-in-her-Daughter-Bedroom

కూతురి బెడ్‌రూంలో ఏదో చప్పుడు.. వెళ్లి చూసిన తల్లికి షాక్..

సీట్యాక్, వాషింగ్టన్: 11 ఏళ్ల కూతురిని ఒంటరిగా ఇంట్లో వదిలి డ్యూటీకి వెళ్లిందా తల్లి. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చిన తల్లికి కూతురు ఆందోళనగా ఉండడం కనిపించింది. అదే సమయంలో ఆమె గదిలోంచి ఏదో చప్పుడు వినిపించింది. దీంతో కూతురి గదిలో వెళ్లిన ఆమెకు బెడ్ కింద బాలుడు దాక్కొని ఉండడం చూసి షాక్ అయింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆమె సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు 18 ఏళ్ల బాలుడిని అదుపులో తీసుకున్నారు. అయితే, పోలీసుల విచారణలో బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఈ సంఘటన వాషింగ్టన్‌లోని సీట్యాక్‌లో జరిగింది.

కింగ్ కౌంటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సీట్యాక్‌కు చెందిన జే నోవా(18) అనే బాలుడికి సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ ద్వారా స్థానికంగా ఉండే 11 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. దీంతో బాలికతో నోవా తరచూ చాటింగ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆగస్టు 28న బాలిక తల్లి ఇంట్లో నుంచి డ్యూటీ వెళ్లగానే ఆమె ఇంటికి వెళ్లాడు. బాలిక కూడా తెలిసిన వ్యక్తి కావడంతో లోపలికి పిలిచింది. ఇంట్లోకి వెళ్లిన అతడు బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక మధ్యాహ్నం భోజనం కోసం తిరిగి ఇంటికి వచ్చిన తల్లికి కూతురు ఆందోళనగా ఉండడం గమనించింది. అదే సమయంలో ఆమె గదిలోంచి ఏదో చప్పుడు కూడా వినిపించింది. 

అనుమానంతో కూతురి గదిలోకి వెళ్లి చూసిన తల్లికి కుమార్తె బెడ్ కింద ఓ వ్యక్తి దాక్కొని ఉండడం కనిపించింది. దీంతో వెంటనే ఆమె గది తలుపులు మూసేసి కింగ్ కౌంటీ పోలీసులకు సమాచారం అందించింది. ఆమె సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు గది తలుపులు తీసి.. బెడ్ కింద నక్కిన నోవాను బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో అతడు తనకు బాలికతో ఉన్న పరిచయంతో పాటు ఆమెతో శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపాడు. దీంతో నోవాపై మైనర్‌పై అత్యాచారం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 24న అతడ్ని కోర్టులో హాజరుపరచనున్నారు.