Mother-Bird-Stops-Moving-Tractor-To-Protect-Eggs-Video-Goes-Viral

హార్ట్ టచింగ్ వీడియో.. గుడ్లను కాపాడుకోవడానికి ట్రాక్టర్‌కు ఎదురు వెళ్లిన పక్షి

బిజీంగ్: తాజాగా సోషల్ మీడియాలో ఓ హార్ట్ టచింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పక్షి తన గుడ్లను కాపాడుకునేందుకు ట్రాక్టర్‌కు ఎదురు వెళ్లడం ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోను చైనాలోని ఉలాన్కబ్ నగరంలో చిత్రీకరించినదిగా తెలిసింది. చెనులో ట్రాక్టర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. గుడ్లపై పొదుగుతున్న పక్షి తనవైపు ట్రాక్టర్ రావడం గమనించడం, వెంటనే రెక్కలు చాపి దానికి ఎదురు వెళ్లడం వీడియోలో రికార్డైంది. అది గమనించిన డ్రైవర్ ట్రాక్టర్‌ను నిలిపివేసి పక్షి వద్ద ఓ బాటిల్‌లో నీరు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో 30వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  

Video Source: CGTN