Manhunt-launched-after-shooting-on-Dutch-tram-wounds-many

న్యూజిల్యాండ్ ఘటన మరువకముందే.. మరో దారుణం

ఆమ్‌స్టర్‌డామ్: న్యూజీలాండ్‌లోని ఓ మసీదులో 50 మందిని బలితీసుకున్న కాల్పుల ఘటన మరువక ముందే ఇవాళ నెదర్లాండ్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. అట్రెక్ట్‌ నగరంలో ట్రామ్‌లో వెళుతున్న ప్రయాణికులపై ఓ అగంతకుడు కాల్పులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వం హెలీకాప్టర్లను రంగంలోకి దించింది. కాగా కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు డచ్ పోలీసులు నగర పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఉదయం 10.45 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయనీ.. తనకళ్ల ముందే ఓ మహిళ కిందపడిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత అక్కడి నుంచి కొందరు పారిపోవడం చూశానని తెలిపారు.