Mangaluru-Resident-Dies-in-Mecca-during-Hajj-Pilgrimage

హజ్ యాత్రకు వెళ్లి.. మక్కాలో మృతి చెందిన మంగళూరు వాసి

మంగళూరు: హజ్ యాత్రకు వెళ్లిన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు వాసి మక్కాలో అనారోగ్యంతో మృతిచెందాడు. మంగళూరులోని బైకంపడి సమీంపలోని షెదిగురికి చెందిన ఏం ఏం బవా(70) మూడు వారాల క్రితం మక్కాకు వెళ్లాడు. సోమవారం జమ్రాత్ చేస్తున్న సమయంలో బవా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే బవాను చికిత్స కోసం సమీపంలోని కింగ్ ఫహాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు చనిపోయాడు. బవాతో కలిసి వెళ్లిన తోటివారు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. కాగా, బవా అంత్యక్రియలు మక్కాలోనే జరగనున్నాయని సమాచారం.