Man-Plays-Fetch-With-Beluga-Whale-Video-goes-Viral

బెలుగా తిమింగలంతో బంతి ఆట.. వైరలవుతున్న వీడియో..

బెలుగా తిమింగలంకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ తిమింగలంతో బోటులో ప్రయాణించిన కొంతమంది వ్యక్తులు ఆడిన బంతి ఆట నెటిజన్లను ఫిదా చేస్తోంది. సాధారణంగా పెంపుడు జంతువులు మన మాట విన్నట్టుగానే బెలుగా కూడా ఆ వ్యక్తుల మాట వినడం వీడియోలో ఉంది. వ్యక్తులు బంతిని నీటిలో విసిరేసిన ప్రతీసారి బెలుగా దానిని నోట కరుచుకొని వచ్చి వారికి అందించడం చూడడానికి ముచ్చటగా ఉంది. వివరాల్లోకి వెళ్తే... ఆర్కిటిక్‌ ధ్రువంలో జెమిని క్రాఫ్ట్‌ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి సరదాగా బోటు షికారుకు వెళ్లాడు. ఆ సమయంలో వారు బెలుగా తిమింగలంతో సరదాగా ఆటలు ఆడారు. రగ్బీ బంతిని నీళ్లలోకి విసురుతూ ఉంటే బెలుగా.. తిరిగి దానిని వాళ్లకు తెచ్చి ఇచ్చింది. ఇలా కొంతసేపు వారి సరదా ఆట కొనసాగింది. ఈ సరదా ఆటకు సంబంధించిన వీడియోను జెమిని క్రాప్ట్ సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు నాలుగు మిలియన్లకు పైగా లైకులు వచ్చి పడ్డాయి. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Video Source: Guardian News