Man-jailed

శృంగారం చేస్తూ.. మధ్యలో కండోమ్ తొలగించాడని..

లండన్: బ్రిటన్‌కు చెందిన లీ హాగ్‌బెన్ అనే వ్యక్తి.. ఓ వెబ్‌సైట్లో వ్యభిచారిణుల కోసం వెదికాడు. ఓ 20 ఏళ్ల అమ్మాయి వివరాలు చూసి, ఆమెను సంప్రదించాడు. అతను చెప్పినట్లుగానే హోటల్ రూమ్‌కి వచ్చిన ఆమె.. రెండు గంటలపాటు అతనితో గడపడానికి అంగీకరించింది. అయితే తనతో శృంగారం చేసేప్పుడు కండోమ్ తప్పనిసరిగా వాడాలని ఆ యువతి చెప్పింది. దానికి సరేనన్న లీ.. శృంగారం మధ్యలో కండోమ్ తొలగించేశాడు. దాంతో ఆమె అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను చంపేస్తానని బెదిరించిన లీ, కండోమ్ లేకుండానే ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆమెకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దీనిపై కోర్టుకెక్కిన ఆ యువతి.. కండోమ్ లేకుండా తనతో శృంగారం చేసినందుకు అతనిపై రేప్ కేసు పెట్టింది. దీంతో లీని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. తనపై వచ్చిన అభియోగాలను లీ నిరాకరించినప్పటికీ, డీఎన్‌ఏ పరీక్షతో అతను చేసిన నేరం రుజువైంది. దాంతో లీకి 12 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు జడ్జి ప్రకటించాడు. ఈ తీర్పు విన్న లీ.. తానను జైలు నుంచి విడుదలకాగానే, ఆ జడ్జిని కాల్చి పారేస్తానని బెదిరించాడు.