Maid-in-UAE-posted-sponsor's-kin-photos

దుబాయ్‌లో ఓ పనిమనిషి చేసిన పని ఇది

దుబాయ్: పనిమనిషి చేసిన పని యజమాని ఆగ్రహనికి కారణమైంది. దాంతో పనిమనిషిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. కోర్టు పనిమనిషికి ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించింది. శిక్ష కాలం పూర్తవగానే ఆమెను దేశం నుంచి పంపించేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. షార్జా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆసియా దేశాలకు చెందిన ఓ మహిళ అరబ్ షేక్ ఇంట్లో పనిచేస్తోంది. ఆమెకు కొద్దిరోజుల్లోనే షేక్ కుటుంబసభ్యులతో మంచి సన్నిహిత్యం ఏర్పడింది. ఓ రోజు పనిమనిషి షేక్ భార్య దుస్తులు వేసుకుని ఫోటోలు దిగింది. అలాగే షేక్ భార్య, పిల్లలతోనూ ఆమె ఫోటోలు దిగింది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ పోస్టుపై నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ విషయం షేక్‌కు కూడా తెలిసింది. దాంతో పనిమనిషిపై షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ అనుమతి లేకుండా తన కుటుంబంతో ఫోటోలు దిగి, తన కుటుంబం పరువు తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.