Kuwaiti-women-drinking-more-than-men

అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా తాగుతున్నారట

కువైట్: కువైట్‌‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా కాఫీని తాగుతున్నట్టు ఓ సర్వేలో తేలిందట. అబ్బాయిల కంటే అమ్మాయిలే కాఫీ ఉత్పత్తుల్లో ఉండే పోషక సమాచారం గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నట్టు సర్వే చెప్పింది. కువైట్ యూనివర్శిటీలోని కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ 1483 మంది 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న కువైట్ దేశస్థులపై సర్వే చేయగా ఈ సమాచారం తెలిసింది. అమెరికానో అనే కాఫీని కువైత్ దేశస్థులు ఎక్కువగా సేవిస్తున్నట్టు కూడా తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 13 శాతం మంది కాఫీ కోసం కేఫ్‌లకు నిత్యం వెళ్తున్నట్టు, 30 శాతం మంది నెలకు ఒకటి నుంచి నాలుగుసార్లు వెళ్తున్నట్టు తెలిసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 51.4 శాతం మంది స్టార్‌బక్స్ కాఫీని ఎక్కువగా ఇష్టపడుతున్నారట.