KTR-sir-please-help-me-so-i-can-go-to-home

‘కేటీఆర్‌ సారూ.. స్వదేశానికి రావడానికి సాయం చేయండి..’

  • దుబాయ్‌లో అనారోగ్యానికి గురైన మల్యాల యువకుడు
  • ఆదుకోవాలని సోషల్‌ మీడియా ద్వారా వేడుకోలు 
మల్యాల, జూన్‌ 18: ఉన్న ఊరిలో ఉపాధి లేక విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు అక్కడ అనారోగ్యానికి గురయ్యాడు. తను పనిచేసే కంపెనీ స్వదేశానికి పంపడం లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు వాట్సాప్‌ ద్వారా మొరపెట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన వరికొప్పల సురేష్‌ కొన్నాళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ 8 గంటల డ్యూటీ అని చెప్పి 13 గంటలు పని చేయిస్తున్నారని.. ఇదేమని అడిగితే బెదిరిస్తున్నారంటూ కేటీఆర్‌కు మొరపెట్టుకున్నాడు. అధిక పని భారంతో అనారోగ్యానికి గురైనట్లు తెలిపాడు. స్వదేశం పంపమంటే రూ.3లక్షలు చెల్లించాలంటూ..ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు తాను ఇండియాకు వచ్చేలా చూడాలంటూ విన్నవించాడు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఇందుకు కృషి చేయాలని వేడుకున్నాడు.