KTR-praised-NATS-for-good-services

నాట్స్‌‌పై కేటీఆర్‌ ప్రశంసల వర్షం

కేటీఆర్‌ను అమెరికా తెలుగు సంబరాలకు ఆహ్వానించిన నాట్స్ 

అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ విసృత్తంగా ఏర్పాట్లు చేస్తోంది. అంగరంగ వైభవంగా తెలుగు సంబరాలను నిర్వహించాలని భావిస్తున్న నాట్స్.. తెలుగు అతిరథ మహారథులను కూడా ఈ సంబరాల్లో భాగస్వాములను చేసేందుకు ఆహ్వానాలను అందిస్తోంది. తెలంగాణ  ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిసిన నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్, నాట్స్ ప్రతినిథులు సంబరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇదే సందర్భంలో నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సేవే గమ్యం నినాదంతో ముందుకు వెళుతున్న నాట్స్ గురించి తనకు బాగా తెలుసని.. నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కేటీఆర్ ప్రశంసించారు. అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సంబరాలకు ఆహ్వానంపై కూడా కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు.