Jewellery-worth-475-Crore-Stolen-from-Daughter-of-Former-F1-Boss

బ్రిటన్ మాజీ ఫార్ములా వన్ బాస్ కూతురి ఇంట్లో భారీ చోరీ...

లండన్: బ్రిటన్ మాజీ ఫార్ములా వన్ బాస్ బెర్నీ ఎక్లెస్టోన్ కుమార్తె తమరా ఎక్లెస్టోన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లో దోపిడీకి పాల్పడిన దుండగులు ఏకంగా సుమారు రూ. 475కోట్ల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే... హైడ్ పార్క్‌లోని తన ఇంటికి తాళం వేసి తమరా క్రిస్మస్ హాలిడేస్‌ ఎంజాయ్ చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్లింది. దీంతో శుక్రవారం రాత్రి కొందరు దుండగులు ఆమె ఇంట్లోకి చోరబడి పెళ్లి సమయంలో తమరాకు తండ్రి ఇచ్చిన విలువైన ఉంగరాలు, చేతి గాజులు, చేవి దుద్దులు ఇతర ఆభరణాలు దోచుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఆభరణాల విలువ సుమారు రూ. 475 కోట్ల వరకు ఉంటుందని లండన్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.