Italy-outraged-as-court-finds-victim-too-ugly-to-be-raped

‘మగాడిలా ఉంది.. ఆమెను మేమెందుకు అత్యాచారం చేస్తాం?’

రోమ్: ఇద్దరు కామాంధులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ కోర్టుకెక్కింది.. న్యాయం చేయాలని వేడుకుంది.. కానీ, ఆమె మగాడిలా ఉందని, అలాంటిది ఆమెను ఎలా రేప్‌ చేస్తారని పేర్కొంటూ ముగ్గురు మహిళా జడ్జిల బెంచీ తీర్పు ఇచ్చింది. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. అంకోనాలో 2015లో ఓ యువతి(22)కి మత్తిచ్చి రేప్‌ చేశారు. 2016లో నిందితులకు శిక్ష పడింది. 2017లో నిందితులు పై కోర్టుకు వెళ్లడంతో ఆ కేసు ముగ్గురు మహిళా జడ్జిల వద్దకు వచ్చింది. వారు నిందితులను ‘ఆమెను మీరు రేప్‌ చేశారా?’ అని ప్రశ్నించగా.. ‘ఆమె చూస్తే మగాడిలా ఉంది. అందవికారంగా ఉంది. ఆమెకు ఎలా ఆకర్షితులం అవుతాం.’ అని బదులు ఇచ్చారు. ఆమె ఫొటో చూసిన జడ్జిలు.. ఆమె మగాడిలాగే ఉందని నమ్ముతూ నిందితుల శిక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు సుప్రీంలో కేసు దాఖలు చేసింది.