is-Stephen-hawking-is-died--so-meny-years-back

ఎప్పుడో స్టీఫెన్ హాకింగ్ చనిపోయాడా?!

 

మనం చూసేది అతని రూపంలో ఉన్న మరొకరు?
బ్రిటన్‌, అమెరికాల్లో కొందరి ఊహాకథనాలు
రియల్‌ హాకింగ్‌ కాదని రుజువు చేసే ఆరు కారణాలు
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఎన్నడో మరణించాడా? ప్రస్తుతం మనం చూస్తున్నది ఆయన రూపంలోనే ఉన్న వేరొక వ్యక్తా? లేక మరబొమ్మా? మనం వింటున్న ఆయన గొంతు కూడా ఆయనది కాదా? అవి అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌లో నుంచి వచ్చే శబ్ద తరంగాలా?... అవుననే వాదిస్తున్నారు బ్రిటన్‌, అమెరికాల్లో కొందరు ప్రముఖ సిద్ధాంతకర్తలు. వారి ఊహ ప్రకారం- స్టీఫెన్‌ హాకింగ్‌ 1985లోనే మరణించాడు. తాను రాసిన ‘ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’ పుస్తక ప్రచురణకు మూడేళ్ల ముందే ఆయన చనిపోయారని, ఆ విషయాన్ని దాచిపెట్టి కొన్ని స్వార్థశక్తులు ఆయన రూపంలో ఉన్న వ్యక్తిని ప్రతిష్ఠించి- తమ సైంటిఫిక్‌ ఎజెండాను వ్యాప్తి చేస్తున్నారని ఈ థియరిస్టుల వాదన. దీనికి దన్నుగా చేసే ఆరు కారణాలను వారు విశదీకరిస్తున్నారు.
 
జీవనకాలం
స్టీఫెన్‌ హాకింగ్‌- ఏఎల్‌ఎస్‌ (ఎమియోట్రోఫిక్‌ లేటరల్‌ స్కెర్లోసిస్‌) అనే వింత జబ్బుతో బాధపడుతున్నారు. మనిషిని క్రమేణా బలహీనపరిచి- కృశించి పోయేట్లు చేసి- శరీరాకృతిని దెబ్బతీసి-నడవలేని స్థితికి చేర్చే ఓ భయంకర నరాల క్షీణత వ్యాధి ఇది. సాధారణంగా ఇది వచ్చిన వారు నాలుగేళ్లకంటే ఎక్కువ బతకరు. 1963లో ఆయనకీ జబ్బు వచ్చింది. రెండేళ్ల పాటు టెస్టులన్నీ జరిగాయి. మహా అయితే ఆయన 1970ల వరకూ జీవించాలి. కాకపోతే మరికాస్త.. కానీ హాకింగ్‌- ఈ జబ్బు వచ్చిన 55 ఏళ్లు తరువాత నేటికీ జీవించే ఉన్నారు. ఈ జనవరి 8నే 77 వ పుట్టినరోజు జరుపుకున్నారు.
 
 వయసు-రూపం
వయసుతో పాటు రూపంలోనూ మార్పు వస్తుంది. కానీ హాకింగ్‌ ముప్పయ్యేళ్ల కిందటి కంటే ఇపుడే చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. 1982 నాటి ఫొటోలతో 2017 నాటి ఫొటోను గానీ రూపాన్ని గానీ పోలిస్తే -చాలా యవ్వ నంతో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వయసుతో పాటు చెవులు క్షీణించవు. మహా అయితే కొంకర్లు తిరుగుతాయి. కానీ హాకింగ్‌కు చెవులు క్షీణించాయి.
నోటి పళ్ల చిగుళ్లు అరిగి పళ్లు ఊడాలి. కానీ ఆయనకు ఊడలేదు సరికదా.. ఇంకా బలంగా ఉన్నాయి.
1965లో ఆయనకు జేన్‌ వెల్డీ అనే మహిళతో పెళ్లయింది. అప్పటికి ఆయన బాగానే ఉన్నారు. కానీ ఆమె వదిలేశాక- ఆయన తనకు నర్స్‌గా సపర్యలు చేసిన ఎలైన్‌ మేసన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ వెడ్డింగ్‌ డే నాటి రెండు ఫొటోల్లో ఉన్నది కచ్చితంగా ఆయన రూపంలో ఉన్న వేరే వ్యక్తి అని, హాకింగ్‌ కాదని స్పష్టంగా తెలుస్తోంది.
 వాయిస్‌ సింథసైజర్‌
ఏఎల్‌ఎస్‌ వ్యాధి సంక్రమించి- హాకింగ్‌ చక్రాల కుర్చీకి పరిమితమయ్యాక- ఆయన వాయిస్‌ సింథసైజర్‌తో మాత్రమే మాట్లాడగలుగుతున్నారు. కుడిదవడను కదిలిస్తూ- ఎదురుగా ఉన్న అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌లో పదాలను స్కాన్‌ చేసుకుని- వాటిని పలికితే అవి శబ్దతరంగాలుగా మారి మనకి వినిపిస్తాయి. కానీ ఇది అసాధ్యం. కుడిదవడ కదలికతో మాటలు రావు. వెనక ఎవరో రోబో వాయిస్‌ వినిపిస్తున్నారు.
 
ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు?
నిజంగా స్టీఫెన్‌ హాకింగ్‌ చనిపోయిఉంటే- ఆయన స్థానంలో వేరే వ్యక్తిని పెట్టడమెందుకు? ఇలా ప్రపంచాన్ని నమ్మించడమెందుకు.. అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. దీనికి సిద్ధాంతకర్తలు చెప్పేదొకటే.. ప్రపంచాన్ని దేవుడే నడిపిస్తున్నాడన్న వాదనలను కొట్టిపారేసి శాస్త్రబద్ధంగా ఆలోచించేట్లుగా మానవాళికి హితవుచెప్పడానికి ఓ వ్యక్తి కావాలి..ఐన్‌స్టీన్‌ లాంటి తెలివితేటలున్న హాకింగ్‌ లాంటి వ్యక్తుల వల్లే అది సాధ్యం.
 
ఈ అనంతవిశ్వంలో మనకి తెలియని అనేక రహస్యాలున్నాయి. వేల గ్రహవ్యవస్థలున్నాయి. వేల సంఖ్యలో సూర్యుళ్లున్నారు. కంటికి కనిపించని అద్భుతాలెన్నో ఉన్నాయి. గ్రహాంతర వాసులున్నారు.. ఇవన్నీ శోధించాలి. సైన్సును నమ్మితేనే ఇది చేయగలం. అందుకే అతన్ని వాడుకుంటున్నారు.. అని!
 
‘‘గత కొద్ది సంవత్సరాలుగా స్టీఫెన్‌ హాకింగ్‌ చెబుతున్న అంశాలు చాలా వరకూ మానవాళిని భయపెట్టేవే. మానవ ప్రపంచం మరో వందేళ్లు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత అంతరిస్తుందని, గ్రహాంతరవాసుల దాడులు పెరిగిపోతాయని.. ఇలా. కృత్రిమ మేధను, డాటా అనలిటిక్స్‌ను కూడా హాకింగ్‌ సమర్థిస్తున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ కూడా పెరిగిపోతుందంటున్నారు. ఇవన్నీ సైన్స్‌ను నమ్మండి- దేవుణ్ణి కాదు..అని చెప్పడానికే’’ అని విశ్లేషిస్తున్నారు హాకింగ్‌ లేరంటూ ప్రచారం చేస్తున్న సిద్ధాంతకర్తలు.