International-Phone-Calls-Business-with-Banned-Telecommunication-Machine-in-Kadapa

రాజంపేట కేంద్రంగా అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ దందా.. అసలు సూత్రధారి కువైత్‌లో..

నిషేధిత యంత్రంతో నిర్వహణ..

రాజంపేట కేంద్రంగా లక్షల ఆర్జన
ఆటకట్టించిన పోలీసులు.. ముగ్గురి అరెస్టు

రాజంపేట(కడప): కడపజిల్లా రాజంపేట కేంద్రంగా నిషేధిత టెలికం యంత్రాన్ని ఉపయోగించి అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ వ్యాపారం చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు. అయితే, దీని సూత్రధారి కువైత్‌లో ఉండడంతో అతనిపై కేసు నమోదు చేశారు. రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి కథనం ప్రకారం.. దేశ భద్రత నేపథ్యంలో నిషేధించిన టెలికం యంత్రాన్ని ఇతర దేశాల నుంచి తెప్పించి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ వ్యాపారానికి తెరదీశాడు. ఏడాది కాలంలో సుమారు రూ.10 లక్షలు సంపాదించాడు. ఇతర దేశాల్లో ఉన్న సుమారు 500 మంది సిమ్‌కార్డులను వీరు సేకరించి సంబంధిత సిమ్‌కార్డుదారులకు లోకల్‌ కాల్‌ రూపంలో అంతర్జాతీయ కాల్స్‌ను మాట్లాడించేవారు. 

అయితే, ఈ యంత్రాన్ని వినియోగించి చేసే.. ఫోన్‌కాల్స్‌ వల్ల ఉగ్రవాదులు, దేశ వ్యతిరేక శక్తులు మాట్లాడే అవకాశాలు ఉంటాయని, దీనివల్ల దేశ భద్రతకు విఘాతం కలుగుతుందనే కారణంగా ఈ యంత్రాన్ని నిషేధించారు. ఈ యం త్రాన్ని తన ఇంటిపై పెట్టి ఫోన్‌కాల్స్‌ చేయిస్తున్న లక్ష్మీనారాయణ కువైత్‌లో ఉం టూ ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతని సహాయకులు మహమ్మద్‌షరీఫ్‌, రాజశేఖర్‌, రాజులను అరెస్టు చేశారు