Infosys-employee-Mannikalal-Subramaniams-body-will-be-flown-to-India-for-funeral

భార్య గర్భిణి.. అమెరికాలో జాబ్ చేసే భర్త.. నేవి విన్యాసాలను చూస్తూ సడన్‌గా..

సీటెల్: అమెరికాలో నేవీ విన్యాసాలు చూస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందిన మన్నికలాల్ సుబ్రహ్మణ్యం అనే ఎన్నారై మృతదేహాన్ని అక్కడి అధికారులు భారతదేశానికి పంపనున్నారు. సీటెల్‌లోని లేక్ వాషింగ్టన్ నదిపై యూఎస్ నేవీ చేస్తున్న విన్యాసాలు చూడటానికై ఈ నెల ఏడో తేదీన సుబ్రహ్మణ్యం తన కొడుకుతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత తండ్రి కనిపించడం లేదంటూ బాలుడు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన అధికారులు సుబ్రహ్మణ్యం నదిలో పడిపోయినట్టు గుర్తించారు. 

స్పృహ కోల్పోయిన సుబ్రహ్మణ్యాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గుండెపోటుతో సుబ్రహ్మణ్యం మరణించాడు. కాగా, సుబ్రహ్మణ్యం అమెరికాలో ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీలో ఓ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం స్వస్థలం కేరళలోని అలప్పుజ. సుబ్రహ్మణ్యం భార్య కడుపుతో ఉండటంతో ఆమె కుటుంబసభ్యులు ఆమెను ఇండియాకు తీసుకొచ్చేశారు. సుబ్రహ్మణ్యం అంత్యక్రియలను కేరళలోనే చేస్తామని కుటుంబసభ్యులు అధికారులను కోరడంతో.. అమెరికా ప్రభుత్వం సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని భారత్‌కు పంపే ప్రయత్నం చేస్తోంది.