Indians-are-high-earners-in-UK--says-Study

ఆ దేశంలోని ఎన్నారైలు.. ఆ దేశస్థులకంటే ఎక్కువ సంపాదిస్తున్నారట

లండన్: బ్రిటన్‌లో నివసిస్తున్న ఎన్నారైలు బ్రిటిష్ దేశస్థుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఓ సర్వే తెలిపింది. ‘ఎథ్‌నిసిటి పే గ్యాప్స్ ఇన్ గ్రేట్ బ్రిటన్ 2018’ సర్వేలో అందరికంటే ఎక్కువగా చైనా దేశస్థులు సంపాదిస్తుండగా.. వారి తరువాతి స్థానంలో భారతీయులు నిలిచారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశస్థులు అందరికంటే తక్కువగా సంపాదిస్తున్నట్టు తేలింది. చైనా దేశస్థులు గంటకు 12.33 పౌండ్లను సంపాదిస్తుండగా.. భారతీయులు గంటకు 12.03 పౌండ్లను ఆర్జిస్తున్నారు. అదే సమయంలో పాకిస్థానీలు 10 పౌండ్లు, బంగ్లాదేశీయులు 9.60 పౌండ్లను సంపాదిస్తున్నారు. మళ్లీ భారతీయులలో అమ్మాయిల కంటే అబ్బాయిలు 23.3 శాతం ఎక్కువగా సంపాదిస్తున్నట్టు తెలిసింది. మరోపక్క బంగ్లాదేశీయులలో మాత్రం అబ్బాయిల కంటే అమ్మాయిలే 10.5 శాతం ఎక్కువగా ఆర్జిస్తున్నారు. భారతీయులు సంపాదనలోనే కాకుండా ఎంప్లాయిమెంట్ రేట్‌లో కూడా ముందంజలోనే ఉన్నారు. భారతీయుల ఎంప్లాయిమెంట్ రేట్ 75.9 శాతంగా ఉండగా.. పాకిస్థాన్, బంగ్లాదేశీయుల ఎంప్లాయిమెంట్ రేట్ 58.2, 54.9 శాతంగా ఉన్నాయి.