Indian-Woman-Stabbed-to-Death-in-Dubai

దుబాయ్‌లో కేరళ మహిళ దారుణ హత్య!

దుబాయ్: కేరళ రాష్ట్రానికి చెందిన మహిళ దుబాయ్‌లో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని కొల్లం నివాసి చంద్ర శేఖరన్, చంద్రిక దంపతుల కూతురు విద్యా చంద్రన్(39)గా గుర్తించారు. దుబాయ్‌లోని అల్ కుసైస్‌లో విద్యా ఇంట్లోనే మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య ఓ విషయమై జరిగిన వాగ్వాదంలో కోపోద్రిక్తుడైన భర్త విద్యాను కత్తితో పొడిచి చంపేశాడు. కాగా,  విద్యా ఇటీవలె విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.