Indian-Origin-mans-hand-fell-off-during-a-lift-accident

రిపేర్ చేస్తుండగా సడెన్‌గా మొదలైన లిఫ్టు.. భారతసంతతి యువకుడి చెయ్యి తెగి..

దుబాయి: భారత్‌కు చెందిన ఫ్లెర్టిన్ బేబీ(33) దుబాయిలో లిఫ్టు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పట్లాగే గత నెల 28న కూడా స్థానికంగా ఓ లిఫ్టు చెడిపోయిందని అతనికి సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న అతను.. లిఫ్టు రిపేర్ చేయడం ప్రారంభించాడు. ఇంతలో సడన్‌గా స్టార్టయిన లిఫ్టు.. ఫ్లెర్టిన్ చేతిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన అతని చెయ్యి.. 26ఫ్లోర్లు కింద ఆగిన లిఫ్ట్‌పై పడింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మగనర్సు, ఫ్లెర్టిన్ చేతిని తీసుకొని ఐస్‌లో ఉంచాడు. అనంతరం అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్న వైద్యులు.. ఈ పరిస్థితిని ఛాలెంజింగ్‌ తీసుకున్నారు. ఫ్లెర్టిన్ తల్లిదండ్రుల నుంచి అనుమతి పొంది అతని చేతిని తిరిగి అతికించడానికి శస్త్రచికిత్స చేశారు. ఎంతో క్లిష్టమైన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.