Indian-Origin-man-molests-minor-girls-in-singapore

చిన్న పిల్లను ఇంటికి పిలిచి.. ఓ భారతసంతతి వ్యక్తి దారుణం.. భయంతో వణికిపోయిన బాలిక..

సింగపూర్: ప్రజలను రక్షించాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడా భారతసంతతి వ్యక్తి. ఆన్‌లైన్లో వారితో పరిచయం పెంచుకుని అశ్లీల చిత్రాలు పంపాలంటూ ఒత్తిడి చేసేవాడు. కుదిరినప్పుడు వారిని తన ఇంటికి పిలిపించుకుని తన కామవాంఛలు తీర్చుకునేవాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో అతనికి సింగపూర్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది.

భారతసంతతికి చెందిన ఏఆర్ అరుణ్ ప్రశాంత్(25) సింగపూర్‌లో పోలీసు అధికారిగా పనిచేసేవాడు. అయితే విధుల్లో ఉన్న సమయంలో ఆన్‌లైన్‌లో కొంతమంది మైనర్ బాలికలను పరిచయం చేసుకుని వారితో అసభ్యంగా పవర్తించాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. దుస్తుల్లేకుండా ఉన్న ఫోటోలను పంపిచాలంటూ వారిని వేధించేవాడు. ఓసారి వారిలో ఒకరిని తన రూమ్‌కు పిలిపించుకుని లైంగికంగా వేధించాడు. అనంతరం ఆమెను టాక్సీ ఎక్కించి ఇంటికి పంపించాడు. ఆ సమయంలో బాలిక భయంతో వణికిపోతుండటం చూసిన టాక్సీ డ్రైవర్.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసు శాఖ ప్రశాంత్‌ను విధుల్లోంచి తొలగించింది. 2016లో ఈ ఘటన జరగ్గా విచారణ అనంతరం సింగపూర్ కోర్టు ప్రశాంత్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పిచ్చింది.