Indian-Licence-work-in-these-countries

మన లైసెన్స్‌కు ఈ దేశాలు గ్రీన్ సిగ్నల్

భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అంతర్జాతీయ అనుమతి 

విదేశాల్లో సొంతగా మీరే కారు నడపొచ్చు.. 
 
వాహనం నడపడం వస్తే సరిపోదు.. డ్రైవింగ్‌ లైసెన్సు కూడా ఉండాలి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 సీసీ, ఆపై మోపెడ్‌ నుంచి బైక్‌ల వరకు, ఆటోల నుంచి లగ్జరీకార్ల వరకు దేనిని నడపలన్నా ఆ వ్యక్తికి లైసెన్స్‌ ఉండాల్సిందే. మనదేశంలో లైసెన్స్‌ జారీకి అమలుచేస్తున్న నిబంధనలతో సంతృప్తి చెందిన పాశ్ఛాత్యదేశాలు ఇక్కడి లైసెన్స్‌తోనే అక్కడ కూడా స్వయంగా వాహనాలు నడుపుకునేందుకు అనుమతి ఇస్తున్నాయి. పార్టీలకో, పెళ్లిళ్లకో, లేక టూరిస్టులుగా తమ దేశాలకు వచ్చే భారతీయులు అక్కడ ఉన్నన్ని రోజులు వారే స్వయంగా వాహనాలు నడుపుకోవడానికి ఇపుడు ఫ్రాన్స్‌, అమెరికా, గ్రేట్‌ బ్రిటన్‌, న్యూజిలాండ్‌, స్విట్జర్‌లాండ్‌, ఆస్ర్టేలియా, జర్మనీ, నార్వే, దక్షిణాఫ్రికా, కెనడా వంటి దేశాలు మన లైసెన్స్‌ను అంగీకరిస్తున్నాయి. అయితే ఈ లైసెన్స్‌తో పాటు ఇంటర్‌ నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌ ఉంటే ఇక అడ్డేలేదు. 
 
 
అమెరికా 
భారతీయులకు ముందుగా గుర్తుకువచ్చే పాశ్చాత్య దేశం ఏది అంటే ఠక్కున అమెరికా అంటారు. ఇక్కడ అనేకమంది భారతీయులున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల నేపథ్యంలో కొంత అక్కడే స్థిరపడ్డారు. మరికొంతమంది వచ్చి వెళుతుంటారు. ఆగ్రదేశంలో మన లైసెన్స్‌తో తిరిగేయవచ్చు. కాకపోతే స్థానికంగా జారీచేసే ఐ-94పత్రం ఉంటేచాలు. 
 
 దక్షిణాఫ్రికా 
ఈ దేశం పేరు తలవగానే ముందుగా మనకు గుర్తొచ్చేది జాతిపిత మహాత్మాగాంధీ నడయాడిన నేలగానే. ఈ దేశం పర్యటనకు ఎక్కువమంది టూరిస్టులుగా వెళుతుంటారు. అక్కడ అడవులు, బీచ్‌లకు మంచి ప్రసిద్ధి. కేప్‌టౌన్‌, జోహన్నస్‌బర్గ్‌, క్రుగర్‌ నేషనల్‌ పార్కు, దర్బన్‌ బీచ్‌ ఫ్రంట్‌ ఇలా సందర్శనీయ స్థలాలను కారు నడుపుతూ చూసేయచ్చు. 
 
 ఫ్రాన్స్
అందమైన నగరాలకు, ప్రపంచ ఫ్యాషన్‌లకు పేరు ఫ్రాన్సు. భూలోక స్వర్గంగా పేరు పొందిన ఈ దేశంలో తీరప్రాంతాలు, విశ్రాంతి మందిరాలు బాగా ప్రాచుర్యం పొందాయి. సిటీ ఆఫ్‌ లైట్స్‌గా పేరు పొందిన ఈ దేశంలో మన లైసెన్స్‌కు ఏడాది పాటు అనుమతి ఉంది. కాకపోతే మన లైసెన్స్‌ను ఫ్రెంచ్‌ భాషలోకి తర్జుమా చేయించుకుని ఉంచుకోవాలి. 
 
 
నార్వే 
ఎక్కువసేపు సూర్యాస్తమ యం.. వెంటనే సూర్యోదయం చూడాలంటే నార్వే వెళ్లాల్సిందే. ఎర్రని ఆకాశానికి బంగారు అభరణం అలంకరించినట్టు సూర్యభగవానుడు దర్శనం ఇస్తాడు. ఈ దేశంలో మన లైసెన్సుతో మూడు నెలలు తిరిగేయవచ్చు. 
 
 
బ్రిటన్
యునైటెడ్‌ కిం గ్‌డమ్‌గా పిలుస్తాం. గ్రేట్‌ బ్రిటన్‌ అంతా మన లైసెన్స్‌కు అనుమతి ఉంది. అయితే ఇక్కడ మోటారు వాహనాలను నడపడానికిమాత్రమే అంగీకరిస్తారు. కారును నడిపేందుకు మాత్రం అవకాశం లేదు.      
 
జర్మనీ
జర్మనీలో చరిత్ర, సాంస్కృతిక, సహజసిద్ధమైన అటవీప్రాంతాలు ఎక్కువ. అక్కడి ప్రాంతాలు సందర్శించేందుకు కారులో వెళితే ఆ ఆనందమే వేరు. ఆక్కడ మన లైసెన్స్‌ ఆరునెలల పాటు అనుమతిస్తారు. అంతర్జాతీయ చోదక అనుమతి (ఇంటర్‌ నేషనల్‌ లైసెన్సు)అవసరం లేదు. 
 
ఆస్ర్టేలియా 
ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ లైసెన్స్‌ను కోరతాయి. అయితే కొన్ని రాష్టాలలో మాత్రం భారత్‌ లైసెన్స్‌ ఉంటే సరిపోతుంది. పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందిన దేశం కనుక అక్కడికి వెళ్లే వారు తప్పనిసరిగా కారు నడుపుకొనే అవకాశం ఉంటే బోలెడంత డబ్బు ఆదా అవుతుంది. 
 
 
కెనడా 
చూడగానే అక్కడే ఉండిపోవాలనిపించే నగరాలు, పరిశుభ్రత, చక్కటి వాతావరణం కెనడాను అత్యంత ఆకర్షనీయమైన పర్యాటక దేశంగా మార్చాయి. వివిధ సంస్కృతుల సమ్మేళనంగా ఉండే ఇక్కడ మన లైసెన్సుకు మూడు నెలల వరకు అనుమతి ఉంది. కాకపోతే ఐడీపీ అవసరం. 
 
స్విట్జర్లాండ్‌ 
బహుభాషలు, బహు సంస్కృతుల కలగలుపు దేశం స్విట్జర్‌లాండ్‌ నాలుగు జాతీయ భాషలు కలిగిన దేశం ప్రపంచంలో ఇదోక్కటే. ఇక్కడ ఏడాది పాటు మన లైసెన్స్‌ పనిచేస్తుంది. 
 
న్యూజిలాండ్‌ 
ప్రపంచంలో మొదటిగా సూర్యోదయాన్ని చూసేదేశం ఇది. ద్వీపాల సమాహారంగా ఉండే ఈ దేశం అతిచిన్నది. ప్రపంచంలో పేరుపొందిన సంస్థల కార్యాలయాలున్న ఈ దేశంలో మన లైసెన్సు ఏడాది పాటు పనిచేస్తుంది.