Indian-expat-picks-apartment-number-as-lottery-ticket-and-wins-more-than-RS-7-Cr-in-Dubai-raffle

దుబాయ్‌లో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన భారతీయ మహిళ

దుబాయ్: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. దుబాయ్‌లో స్థిరపడిన భారతీయ మహిళ బీజల్ సరదాగా కొన్న లాటరీకి రూ. ఏడు కోట్ల ప్రైజ్‌మనీ తగిలింది. మంగళవారం దుబాయ్ డ్యూటీ ఫ్రీ(డీడీఎఫ్) అధికారులు తీసిన డ్రాలో బీజల్ మొదటి విన్నర్‌గా నిలిచింది. ఒక్క దెబ్బతో కోటీశ్వరురాలైన ఆమె ఆనందానికి అవధుల్లేవు. బీజల్ లాటరీ టికెట్ ఎలా కొన్నదో కూడా వివరించింది. జులై 25న భారత్‌కు ప్రయాణమైన సమయంలో దుబాయ్ డ్యూటీ ఫ్రీ(డీడీఎఫ్) మిల్లెనియమ్ మిలియనీర్ లాటరీ కౌంటర్‌కు ఆమె వెళ్లింది. తన అపార్ట్‌మెంట్ నంబరు అయిన 4111 అనే నంబరుతో ఉన్న లాటరీ.. ఆమె కంటపడటంతో ఆ నంబరు లాటరీనే కొనుగోలు చేసింది. చివరకు అదే నంబరుపై పది లక్షల డాలర్ల(రూ. 7 కోట్లకు పైగానే) ప్రైజ్‌మనీని గెలుచుకుంది. అయితే తాను గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని చారిటీలకు ఉపయోగిస్తానని బీజల్ తెలిపింది. తాను ఎన్నో ఏళ్ల నుంచి ఈ లాటరీ డ్రాలో పాల్గొంటూ వస్తున్నట్టు బీజల్ పేర్కొంది. కాగా, 1999 నుంచి ఈ లాటరీ డ్రాను నిర్వహిస్తూ వస్తుండగా.. భారతదేశానికి చెందిన వారు ఇప్పటి వరకు 147 మంది ఈ డ్రాలో గెలుపొందారు. బీజల్‌ గెలుపుతో ఈ సంఖ్య 148కు చేరింది. దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోని టెర్నినల్ 3లో ఈ లాటరీ డ్రాను నిర్వహిస్తారు. 

Related Articles